ఫ్రీలాన్సింగ్ ఎలా ఉపయోగించుకోవాలి

ఫ్రీలాన్సింగ్ ఎలా ఉపయోగించుకోవాలి

ఫ్రీలాన్సర్లు సాధారణంగా ఒక్కో ప్రాజెక్ట్ ఆధారంగా పని చేస్తారు. ఉదాహరణకు, వారు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో ప్రాజెక్ట్లను తీసుకోవచ్చు మరియు ప్రాజెక్ట్ ద్వారా లేదా దానిని పూర్తి చేయడానికి పట్టే సమయం ద్వారా ఛార్జ్ చేయవచ్చు,

ఫ్రీలాన్సర్లు తమ స్వంత పని సమయ పట్టిక  తయారు  చేసుకుంటారు మరియు నిర్ణీత గడువులోగా పని చేస్తారు. ఉదాహరణకు, వారు నెల ప్రారంభంలో క్లయింట్ నుండి కొన్ని  అసైన్మెంట్లను తీసుకుంటారు , నెల లో వారికి  ఎప్పుడు వీలయితే  అప్పుడు  పని చేస్తారు మరియు  ఫ్రీలాన్సర్లు తమకు నచ్చిన  ప్రదేశం లో  మరియు నచ్చిన  సమయంలో  పని  చేస్తారు  మరియు వారు తమ ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం కూడా చేయవచ్చు

 


ఫ్రీలాన్స్ ప్రక్రియ లో ముఖ్యమైన విషయాలు

 

·         ఫ్రీలాన్సర్  కాంట్రాక్ట్ పని కోసం క్లయింట్ జాబ్ పోస్టింగ్  కి  అప్లై చేస్తారు

·         ఫ్రీలాన్సర్లు  ప్రాజెక్ట్  లేదా  పనిగంటల ఆధారంగా  ధర నిర్ణయించు కుంటారు

·         నిర్ణీత ధర కు, సమయానికి   ప్రాజెక్ట్లను పూర్తి చేసి క్లయింట్ కి అప్పగిస్తారు

·         క్లయింట్ ఫ్రీలాన్సర్కి  నిర్ణయించిన  ధర  ఆధారంగా పని  పూర్తయిన తరువాత  చెల్లిస్తాడు

·         కొన్ని  ఫ్రీలాన్స్  సైట్స్  ఫ్రీలాన్సర్ చెల్లింపుల నుండి నుండి నిర్ణీత కమిషన్  తీసుకుంటాయి

·         ఫ్రీలన్సర్  పని, ప్రవర్తన  ఆధారంగా  క్లయింట్  ఫ్రీలన్సర్ కి రేటింగ్ ఇస్తారు

 

ఫ్రీలాన్సింగ్కెరీర్ లో  మీకు  నచ్చిన  పని, నచ్చిన

 సమయం  లో  చేసుకునే  సౌలభ్యాన్ని కలిగిస్తుంది,    మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తుంది మరియు  మీ  ప్రతిభకు  తగిన  విలువ ను పొందడానికి  అవకాశం  ఇస్తుంది . క్లయింట్ మీ విలువకు తగిన పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు వారి ఆఫర్ను తిరస్కరించవచ్చు మరియు మరొక క్లయింట్తో  పనిచేసుకోవచ్చు .

 

ఫ్రీలాన్సర్గా ఎవరు  సరిపోతారు

 

జీవితంలో అన్ని విషయాల లాగానే  ఫ్రీలాన్సింగ్కు కూడా  లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి, కానీ లాభాలు నష్టాల కంటే ఎక్కువగా ఉన్నాయి  అని ఎక్కువ మంది  అభిప్రాయం ప్రకారం,

ఫ్రీలాన్సర్లు గా పని చేయడానికి  ఫ్రీలాన్సర్లు ఇష్టపడే కొన్ని విషయాలు



ఎల్లప్పుడూ పని అవకాశాలు ఉంటాయి . ప్రతి రోజు , ఫ్రీలాన్స్ ప్లాట్ఫారమ్లకు కొత్త ఉద్యోగ పోస్టింగ్లు జోడించబడతాయి. అయితే, మీరు వీటిలో ప్రతిదానికి సరిపోరు , కానీ అనేక అవకాశాలు మీకోసం ఉంటాయి

మీరు మీ షెడ్యూల్ని నిర్ణయించుకోవచ్చు . మీకు కావలసినప్పుడు, మీకు ఎలా కావాలంటే మరియు మీకు కావలసినంత సమయం పని చేయవచ్చు . మీకు అవసరం అయినప్పుడు  సెలవు కోసం మీ ఉన్నత అధికారులను బ్రతిమాలాడాల్సిన అవసరం ఉండదుమీకు వేకువనే  పని చేసే అలవాటు ఉంటే  వేకువనే పని చేసుకోవచ్చు  మరియు  మీకు  రాత్రి ఎక్కువ  పనిచేసే అలవాటు ఉంటె  రాత్రి పనిచేసి  ఉదయం  ఆలస్యం  గా నిద్ర లేవోచ్చు . ఫ్రీలాన్సింగ్తో, మీరు నిర్దిష్ట గంటలపాటు ఆఫీసుతో ముడిపడి ఉండకుండా, మీ ఉత్తమమయిన పనిని నచ్చిన సమయంలో  చేసుకోవచ్చు

 

విభిన్న అనుభవాన్ని సంపాదించు కోవడానికి  మీకు ఫ్రీలాన్స్  రూపంలో అద్భుతమైన చాలా అవకాశాలు  ఉన్నాయి . మీరు వివిధ ప్రాజెక్ట్లలో విభిన్న క్లయింట్లతో   కలిసి పని చేయవచ్చు మరియు కొత్త విషయాలు  నేర్చుకోవచ్చుసాంప్రదాయ  కార్యాలయాలలో  నాలుగు గోడల మధ్య  సాధ్యం కాని అనుభవాన్ని ఫ్రీలాన్సింగ్ ద్వారా  మీరు పొందవచ్చు.

 

మీరు ఎవరితో కలిసి పని చేయాలో  ఎంచుకునే  స్వతంత్రం మీకు ఉంటుంది . క్లయింట్తో  విభేదిస్తే  మీరు మరొక  క్లయింట్  తో కలిసి  పని చేయవచ్చు .   ఒకవేళ  ఆఫీస్  రాజకీయాలు  మిమ్మల్ని  ఇబ్బంది పెడితే  మీరు మీకు నచ్చని  విషపూరిత వాతావరణంలో ఉండవలసిన అవసరం లేదు, మీకు కావలసిన సమయంలో  కావాలిన వారితో, నచ్చిన వారితో పని చేసుకోవచ్చు

ఫ్రీలాన్సింగ్ యొక్క ప్రతికూలతలు ఏమిటి?

 

ఫ్రీలాన్సర్గా పనిచేయుటానికి   చాలా విషయాలు  అనుకూలతలు ఉన్నప్పటికీ, అలాగే  కొన్ని ప్రతికూలతలు కూడా  ఉన్నాయి

కొన్ని సార్లు ఒకే సమయంలో  చాలా పనులు దొరుకుతాయి , కానీ  కొన్ని సమయాలలో పని దొరకక పోవచ్చు , ఒక  పని  చేసేటపుడు జాగ్రత్తగా  ప్లానింగ్ చేసుకోవడం చాలా అవసరం, ఒక  పని పూర్తయిపోయే సమయం మరియు కొత్త పని వెతుక్కునే సమయం మీకు తెలిసి ఉండాలి 

మీరు  ఫ్రీలన్సర్ గా మారిన మరుక్షణం అంటే ఒక ప్రొఫైల్ తయారు చేసిన వెంటనే పనులు దొరకవు, కొన్ని సార్లు కొన్ని నెలలు కూడా పట్టవచ్చు కానీ మీరు నిరంతరం ప్రయత్నించడం ద్వారా మీ ప్రయత్నం విజయవంతం గా పూర్తి చేయవచ్చు

ఒక్కసారి ఒక పని సాధించిన తరువాత క్లయింట్ మీ  పనికి ఇచ్చిన రేటింగ్స్  మీ తదుపరి  ప్రయత్నం పై ప్రభావం చూపుతాయి

మీకు క్రమశిక్షణ మరియు నమ్మకంగా పనిచేయడం  అవసరం. మీరు మంచి ఫ్రీలాన్సర్‌గా రూపొందాలి అనుకుంటే , మీరు సొంత  ప్రేరణ కలిగి  ఉండాలి. మీరు ఏమి చేస్తున్నారో ఏ బాస్ తనిఖీ చేయరు కానీ మీ పనికి మీరే బాస్ మరియు వర్కర్, మీ పనిలో  ఉత్తమ ఫలితం రాబట్టడమే మీ  మొదటి  ఉద్దేశం అయి ఉండాలి 

 

కొన్నిసార్లు మీరు ఎక్కువ సమయం పనిచేయవలసి రావొచ్చు, అప్పుడు మీరు ఒక సాధారణ ఉద్యోగి పనివేళల కంటే ఎక్కువ సమయం కేటయించ వలసి రావొచ్చు , మీరు అన్నింటికీ  సిద్ధం గా ఉండాలి

 

మొత్తంగా  ఒక  ఫ్రీలాన్సర్ గా ఉండడం అంటే మిమ్మల్ని మీరు ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడం మరియు నిత్యం కొత్తగా ప్రయత్నించడం, ఎలాంటి పరిస్థితిలోనైనా ఒత్తిడికి లోనవకుండా నిత్యం పనిచేయడం మరియు ప్రయత్నిస్తూ ఉండడం

 

 

Post a Comment