మీరు విలువైన జీవితాన్ని ఎలా జీవించగలరు


 

జీవితం అంటే ఏమిటి, అది బాల్యం నుండి వృద్ధాప్యం వరకు జీవించేది మాత్రమేనా

లేదా  కొత్త తరాలను సృష్టించి వారిని కాపాడేదా

విషయాలు ప్రకృతిలో జంతువులు, చెట్లు ఇంకా    అనేక జీవులు కూడా చేస్తున్నాయి అయితే ప్రకృతిలో మనిషి మరియు  మిగిలిన వాటి మధ్య తేడా ఏమిటి?



పప్రకృతి లో ఉత్తమంగా  జీవించడానికి మరే ఇతర ప్రాణికి లేని  అవకాశాలు, అర్హతలు మనిషికి  మాత్రమే ఉన్నాయి , కానీ  కొందరు  మనుషులు వాటిని  తేలుకుంటారు కొందరు వాటి గురుంచి తెలుసుకోరు,  మనిషి ఆలోచన దేన్నైనా చేయగలదు మరియు  చేయించగలదు , ఇలా ఆలోచించడం ప్రకృతి లో కేవలం మనిషికి మాత్రమే సొంతం, మనిషి చేయాల్సిందంతా ఎలా జీవించాలో తెలుసుకోవడం  మరియు ఆలోచించడం మార్చుకోవడం

 

జీవితానికి విలువను జోడించే అంశాలు ఏమిటి


జీవితంలో కొన్ని విలువైన అంశాలు

  నిజమైన ప్రేమ

 మంచి మిత్రులు

ప్రియమైన వారితో గడిపే మంచి సమయం

వృత్తిలో విజయాలు

ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి ప్రయత్నించడం

మన చుట్టూ ఉన్న మంచి నుండి ప్రేరేపించబడడం  మరియు అనుసరించడం

సంతోషంగా జీవించడం మరియు ఆనందాన్ని పంచడం

వినయంగా ఉండటం

  మనశాంతిఁగా  జీవించడం

 

ఒక వ్యక్తి జీవితంలో నిజమైన విలువ ఏమిటి?



సాధారణంగా  జీవితం అందరికీ సాదరంగా మొదలవుతుంది కానీ ఒక మనిషి అనుసరించే పద్ధతులు, జీవించే విధానం  ఒక  జీవితాన్ని  విలువైనదిగా మారుస్తాయి, కొన్ని సార్లు  మనం కొందరితో  మాట్లాడినప్పుడు లేదా  సమయం గడిపినప్పుడు మనకు  అది ఒక అద్భుతమైన జ్ఞాపకం లా మిగిలిపోతుంది, మరియు వాళ్ళ లో ఉన్న  కొన్ని గుణాలు  మరియు  విలువలు మనల్ని ఆకర్షిస్తాయి, మరియు  మనం కూడా  వారిలా  ప్రవర్తిస్తే  బాగుంటుంది  అనుకుంటాము

అలా ఒక జీవితం  ఇంకొక జీవితాన్ని  ప్రభావితం చేసే విలువలున్న జీవితాలను, విలువైన  జీవితాలు  అంటారు, అటువంటి గుణాలను అలవర్చుకున్న వ్యక్తులు సంతోషంగా జీవించడమే కాకుండా ఇతరులను కూడా సంతోషపరుస్తారు.    సమయం విలువ, సంబంధాల విలువ తెలిసిన వ్యక్తులు, ముఖ్యంగా  జీవితం విలువ తెలిసినవారు  ఎక్కువగా ఇతరులపై ప్రభావం చూపుతారు,

చుట్టుపక్కల వ్యక్తులు కూడా వారితో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు వారిని అనుసరించడానికి ఇష్టపడతారు, కాబట్టి విలువైన లక్షణాలను కలిగి ఉండటం జీవితాన్ని  జీవించడంలో తేడాను తీసుకొస్తుంది


మీరు విలువైన జీవితాన్ని ఎలా  జీవించగలరు ?

జీవితాన్ని మనం ఎంచుకున్న  మార్గంలో జీవించడం మనకు సంతోషాన్నిస్తుంది, జీవితం మన బాల్యంలో మొదలై వృద్ధాప్యంలో ముగుస్తుంది,

మన పుట్టుక మరియు జీవిత ముగింపును ఎంచుకునే హక్కు మనకు లేదని మనకు తెలుసు,

 అయితే మనం మార్గాన్ని ఎంచుకోవాలి,

విలువైన జీవితాన్ని ఎలా గడపాలి,

 మనం ఎలా జీవించాలో నిర్ణయించుకునే అవకాశం మాత్రమే ఉంది

మనం బాల్య దశ, యవ్వన దశ జీవించిన తరువాత మన ముసలి దశ జీవితంలో ఒక  సారి మనజీవితాన్ని నెమరువేసుకుంటే  ఒకవేళ  గుర్తులు మనకు సంతోషాన్నిస్తే , మనం  విలువైన  జీవితం  జీవించినట్లే

విలువైన  జీవితాన్ని  గడపడంలో  కొన్ని విషయాలు మీకు  సహాయపడతాయి, మీ  జీవిత  ప్రణాళికలో  ఈ  క్రింది వాటిని చేర్చడం  ద్వారా మీ జీవితానికి విలువ జత చేయవచ్చు  మరియు ఇతరులను కూడా ఆలోచింప చేయవచ్చు

మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి

మీకు అవసరమైన వాటి జాబితా  తయారు చేయండి

మీకు సంతోషాన్ని కలిగించే మరియు మీ జీవితానికి విలువనిచ్చే వాటిని చేయండి

ఎల్లప్పుడూ జీవితం గురించి అవగాహన కలిగి ఉండండి మరియు అవకాశాలను  ఉపయోగించుకోండి

జీవించడానికి గల కారణాన్ని అర్థం చేసుకోండి

క్రమం తప్పకుండా స్వీయ-తనిఖీ చేసుకోండి

మీ లక్ష్యాలపై స్పష్టంగా ఉండండి

భౌతిక విషయాల కంటే  విలువలకు  ప్రాధాన్యత ఇవ్వండి

ఇతరుల పట్ల కూడా శ్రద్ధ వహించండి

వీలయితే  మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి  మీ  ప్రణాళికలలో చేర్చండి  మరియు వాటిని  అమలు చేయడానికి ప్రయత్నించండి

ప్రశాంతంగా జీవించండి మరియు జీవితాన్ని తేలికగా తీసుకోండి

సమయాన్ని వృథా చేయకండి, క్రమం తప్పకుండా ఏదైనా చేయడం ద్వారా మీ జీవితానికి విలువను పెంచుకోండి

మానవ జీవితం ఎప్పుడు  విలువైనది అంటారు





మానవ జీవితం యొక్క విలువ మన జీవితంలో ప్రమేయం ఉన్న వాటిపై ఆధారపడి ఉంటుంది, కొన్నిసార్లు మన జీవితాలు మనకు మాత్రమే విలువైనవి, కొన్నిసార్లు మన జీవితాలు మనపై ఆధారపడిన వారికి కూడా విలువైనవి, కానీ జీవితం అన్ని  అంశాలలో సంతృప్తినిచ్చి  మరియు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే దాన్ని  విలువైన జీవితం అంటారు

విలువైన  జీవితానికి  కచ్చితమైన  ఉదాహరణలు  లేవుకాని, ఒకరు  తాము  ఇంకొకరికి హాని చేయకుండా సంతోషంగా, ఇంకొకరికి  ఉపయోగపడుతూ  జీవించడమే విలువైన జీవితం, ఇలా జీవించినవారి గురించి ఒక వీధిలో లేదా ఊరిలో లేదా ఒక ప్రాంతంలో  ఎక్కువ మంది ప్రేమిస్తారు మరియు ఎక్కువ కాలం గుర్తించుకుంటారు, మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండవచ్చు లేదా మనకి తెలిసిన వాళ్లలో ఉండవచ్చు 

మనిషిగా జీవించడం ఒక అద్భుత అవకాశం మరియు విలువైన జీవితాన్ని జీవించడం ఒక గొప్ప వరం అనుకోవాలి

Post a Comment