ఫ్రీలాన్సింగ్
ఫ్రీలాన్సింగ్
ఉపాధి కాదు. ఇది కేవలం
పని చేసే ప్రక్రియ.
కార్పొరేషన్ ద్వారా శాశ్వతంగా ఒప్పందం
లేదా పర్యవేక్షణ లేకుండా
నేరుగా ఆన్లైన్లో ప్రాజెక్ట్
ప్రాతిపదికన ఒక వ్యవస్థాపకుడి
పని పూర్తి చేయబడుతుంది.
ప్రజలు చాలా సంవత్సరాలుగా ఫ్రీలాన్సింగ్
చేస్తున్నారు
మీరు ఫ్రీలాన్సింగ్‌కు
కొత్త అయితే మరియు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు అంటే ఏమిటి మరియు ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటో
తెలుసుకోవాలనుకుంటే, ఈ పోస్ట్ మీ కోసం. ఫ్రీలాన్సింగ్‌కు
ఇది ఒక గైడ్‌గా పరిగణించండి. ఇప్పుడు పని చేసే
విధానం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌కు మారుతున్నందున,
మీ ఆన్‌లైన్ ప్రయాణాన్ని ఇంటి నుండి ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రధానంగా దృష్టి
పెడదాము. ఈ పోస్ట్ లో మీరు ఫ్రీలాన్సర్ కావాలనుకుంటే
ఏ పద్దతులను ఫాలో అవ్వాలి అనే దాని పై వివరించ
బడింది
ఫ్రీలాన్సర్ అనేవాడు ఒక
స్వతంత్ర ఉద్యోగి, అతడు ఇతరుల పనులను తన నియమాల
ప్రకారం చేసేవాడు, ఒక ఫ్రీలన్సర్ కి పనిని
మరియు పని చేసే సమయాన్ని ఎంచుకునే వెసులుబాటు
ఉంటుంది, ఒక పని తనకు
నచ్చితే చేస్తాడు లేకుంటే చేయడు, ఒక ఫ్రీలన్సర్ కి స్వేచ్ఛ ఉంటుంది,
ఫ్రీలాన్సర్ పనిచేసే
విధానం అది ఒక ఫ్రీలన్సర్ కి మరియు ఒక క్లయింట్ కి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం
నిర్ణయించ బడుతుంది, ఉదాహరణకు ఒక ఫోటోగ్రాఫర్ ని తీసుకుంటే అతను ఒక ఒప్పందం ప్రకారం
కొన్ని ఫోటోలను షూట్ చేసి ఇస్తాడు, దానికి ధర, సమయం, నాణ్యత ముందే నిర్ణయించు కుంటారు మరియు ఫోటోగ్రాఫర్ ఒప్పందం ప్రకారం పని పూర్తి చేస్తాడు,
కానీ క్లయింట్ పర్యవేక్షణలో పని చేయడు
కేవలం అతని పనిని
నిర్ణయించిన ధరకి సరైన సమయం లో పూర్తి చేయడం
మాత్రమే ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ బాధ్యత
ఒక ఫ్రీలన్సర్ ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులను చేయవచ్చు మరియు ఒకరి కంటే ఎక్కువ క్లయింట్
ల కొరకు పనిచేయవచ్చు, అది ఒక ఫ్రీలన్సర్ యొక్క ఎబిలిటీ
పైన ఆధారపడి ఉంటుంది, కానీ ఒక క్లయింట్
తో ఒప్పందం ప్రకారం అతనికి సమయం కేటాయించాలి, మరియు నిర్ణయించిన పనిని పూర్తి
చెయ్యాలి
ఫ్రీలాన్సర్లు దాదాపు అన్ని రకముల పనులను చేస్తారు, రైటింగ్, ఎడిటింగ్,
కన్సల్టెన్సీ, మార్కెటింగ్, డిజైనింగ్, వర్చువల్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్
మొదలైన సేవల నుండి ఏదైనా ఫీల్డ్‌ను ఫ్రీలాన్సర్‌గా ఎంచుకోవచ్చు. కొన్ని పనులు క్లైంట్స్ పర్యవేక్షణలో ఆన్లైన్
లో చేస్తారు, మరి కొన్ని పనులు ఆఫ్ లైన్ లో కూడా చేస్తారు,
ఇప్పటికి మీకు ఫ్రీలాన్సెన్గ్ అనే ప్రక్రియ
పైన ఒక ఐడియా వచ్చింది అనుకుంటా, మీ ప్రొఫైల్
మీకు క్లయింట్ నుండి జాబ్ సంపాదించుటలో ముఖ్యమైన
పాత్ర పోషిస్తుంది కావున దానిని చాలా తెలివిగా రూపొందించాలి, అది మీ ప్రతిభను ప్రతిబింబించే
విధంగా ఉండాలి
మీరు ఒక కంటెంట్ రైటర్
అయితే మీరు ఒక బ్లాగ్ ని రూపొందించి అందులో మీ కంటెంట్ ని అప్లోడ్ చేయడం ద్వారా మీరు మీ కంటెంట్ ప్రతిభను
ప్రదర్శించవచ్చు మరియు దాని లింక్ మీ జాబ్ అప్లికేషన్ లో చేర్చడం
ద్వారా మీరు ఒక క్లయింట్ నుండి ప్రాజెక్ట్
సంపాదించవచ్చు , మీరు ఒక వెబ్ డిజైనర్ అయితే ఒక శాంపిల్ వెబ్ సైట్ తయారు చేసి మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు
ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ లో చాలా వెబ్సైట్లు ఫ్రీలాన్స్ జాబ్స్
కొరకు పనిచేస్తున్నాయి, అందులో మీరు కావలసినన్ని జాబ్స్ , ప్రాజెక్ట్స్ సంపాదించొచ్చు , అక్కడ ప్రతిరోజూ కొత్త జాబ్స్ పోస్ట్ చేయబడతాయి , మీరు
ఆ వెబ్సైట్ లో ప్రొఫైల్ చేసుకుంటే ఆ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు
మీరు కనుక టెక్నికల్ గా కోడింగ్ ఎక్స్పర్ట్ అయితే మీరు వెబ్
డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఆప్ బిల్డింగ్ వంటి పనులు చేయవచ్చు, ఒకవేళ కోడింగ్
తెలియక పొతే మీరు కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ వంటి జాబ్స్ చేయవచ్చు
అసలు మీకు ఏ పని రాకపోతే
మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే డేటా ఎంట్రీ
, ఆన్లైన్ రీసెర్చ్ మరియు డేటా కలెక్షన్ వంటి జాబ్స్ చేయవచ్చు
ఫ్రీలాన్సింగ్ లో ముఖ్యమైన
విషయాలు
- మీరు ఫ్రీలాన్సింగ్ కి సూట్ అవుతారో లేదో ముందు అంచనా వేసుకోవాలి
- క్రమశిక్షణ, నమ్మకం కలిగి ఉండాలి ఇవి ప్రతి రోజు గుర్తించుకోవలిసిన ముఖ్యమైన విషయాలు
- మీ ప్రతిభకు మరియు మీ పని విభాగానికి చెందిన ప్లాట్ ఫారం ని ముందుగా గుర్తించాలి
- మీ ఎక్సపర్టీస్ ని సరిగ్గా వివరించే విధంగా మీ ప్రొఫైల్ ని తయారు చేసుకోవాలి
- మీ పరిజ్ఞానం, అనుభవం ని నిజాయితీగా మీ ప్రొఫైల్ లో రాయండి , ఒకవేళ మీరు బిగినర్ అయితే ఎక్స్పర్ట్ అని రాయవద్దు
- మీ ప్రొఫైల్ ఫోటో గా ఒక ప్రొఫెషనల్ ఫోటో ని ఎంచుకోండి, మరీ ముఖ్యంగా ముఖం పై చిరునవ్వుతో ఫ్రెండ్లీ లుక్ తో ఉండేటట్టు చూసుకోండి
- మీరు ఛార్జ్ చేసే విలువను మీ పనికి తగినట్లుగా నిర్ణయించుకోండి, ఇది మిమ్మల్ని కాంపిటీషన్ లో విజేతగా నిలబడే విషయంలో సహాయ పడుతుంది
- మీరు సరిగ్గా చేయగలిగే పనులను మాత్రమే ఎంచుకోండి
- మీ క్లయింట్ తో మంచి కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేయడం
కామెంట్‌ను పోస్ట్ చేయండి